TG : పొంగులేటికి మంత్రి అర్హత లేదు..ఏలేటి సంచలన వ్యాఖ్యలు

Update: 2024-07-22 17:11 GMT

యూరో ఎగ్జిన్ బ్యాంకు కుంభకోణంలో మంత్రి పొంగులేటి కంపెనీ భాగస్వామి అంటూ బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఫైరయ్యారు. మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డికి చెందిన రాఘవ కంపెనీపై ఈ ఆరోపణలు చేశారు. కుంభకోణంలోని కాంట్రాక్టర్ల పేర్లు తాను త్వరలోనే బయటపెడతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని.. దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను ఉల్లగించి నడుపుతూ మోసం చేశారని ఏలేటి అన్నారు. రాష్ట్ర మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. వెంటనే యూరో ఎగ్జిన్ బ్యాంక్ గ్యారంటీలపై విచారణ జరిపించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News