Motkupalli Narasimhulu : ముహూర్తం ఫిక్స్.. కారెక్కనున్న మోత్కుపల్లి..!
Motkupalli Narasimhulu : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 18వ తేదీన ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు.;
Motkupalli Narasimhulu (Tv5news.in)
Motkupalli Narasimhulu : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 18వ తేదీన ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. మోత్కుపల్లికి టీఆర్ఎస్ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఆయన.. అధికార టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధుకు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. అంతేకాకుండా కేసీఆర్ ని తెలంగాణ అంబేద్కర్‌గా అభివర్ణించారు. కాగా దళిత బంధు పథకాన్ని చట్టబద్దం చేసి దానికి మోత్కుపల్లిని చైర్మెన్ గా నియమిస్తారన్న చర్చ నడుస్తోంది.