Bhatti Vikramarka : ఎల్ఆర్ఎస్ కోసం నయా టీమ్స్ : డిప్యూటీ సీఎం భట్టి

Update: 2024-07-26 15:01 GMT

లే అవుట్‌రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్‌) అమలు కోసం కొత్త జిల్లాల వారీగా టీమ్స్ ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka ) అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ అమలుపై సెక్రటేరియట్ లో శుక్రవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. జనాలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా అమ‌లు చేయాలని భట్టి స్పష్టం చేశారు. ఎల్ఆర్‌ఎస్ విధివిధానాల‌ కసరత్తుపై ఆయన చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు. జిల్లాల వారీగా టీమ్స్ ఏర్పాటు చేసి.. సిబ్బంది కొర‌త ఉంటే ఇత‌ర శాఖ‌ల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకోవాలని సూచించారు. స‌మావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రామ‌కృష్ణారావు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీలు నవీన్ మిట్టల్, జ్యోతి బుద్ధ ప్రకాష్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు.

Tags:    

Similar News