కామారెడ్డి- రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చి కుక్కల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.రాజంపేట మండల కేంద్రంలో వ్యవసాయ పనుల నిమిత్తం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిపై పిచ్చి కుక్కలు దాడి చేశాయి.దీంతో తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట మండల కేంద్రంలో రోజురోజుకు పిచ్చి కుక్కల సంచారం ఎక్కువైందని గ్రామస్తులు పేర్కొన్నారు.గత వారం రోజుల నుంచి ఇప్పటివరకు 30 మందికి పైగా పిచ్చి కుక్కల దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు వీధి కుక్కలు గ్రామల్లో సంచరించకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.పలుమార్లు ప్రజాప్రతినిధులకు,పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ ఇప్పటికైనా అధికారులు పిచ్చికుక్కలను గ్రామం నుంచి తరిమి కొట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.