TS : ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి.. భట్టికి మొగులయ్య విజ్ఞప్తి

Update: 2024-02-28 04:52 GMT

పద్మశ్రీ అవార్డు (Padmi Shri Award) గ్రహీతలకు రూ. 25 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు (Bhatti Vikramarka) కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మొగులయ్య మల్లు భట్టి విక్రమార్కను కలిసి పద్మ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.25 వేలు ఫించన్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మార్చి నెల నుంచి పెన్షన్ అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా లిం గాల మండలం అవుసుల కుంట గ్రామంలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీమ్లా నాయక్ సినిమాలో తాను రాసి పాడిన పాటను పాడి మల్లు భట్టి విక్రమార్కకు వినిపించారు.

కళాకారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందనడానికి పెన్షన్ ప్రకటనే ఉదహారణ మన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇప్పటివరకు సొంత ఇల్లులేదని ఆయన మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకువచ్చారు.

కాగా, కిన్నెర మొగులయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2015లో గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.

Tags:    

Similar News