హైదరాబాద్ పై తనదైన మార్క్ వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సిటీ సిగలో మరో మణిహారాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎంటర్ టైన్ మెంట్ హబ్ తో పాటు ఉల్లాసానికి, సౌకర్యానికి కేరాఫ్ గా రాయదుర్గంలో దీనికి అంకురార్పణ చేయాలని నిర్ణయించింది.
న్యూయార్క్ లోని సుప్రసిద్ధ టైంస్క్వేర్ మాదిరిలో "టీ-స్క్వేర్” నిర్మాణానికి ప్రభుత్వం సం సిద్ధత వ్యక్తం చేసింది. హైదరాబాద్లోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టేం దుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండగా, తాజాగా ఆర్కిటెక్చరల్, లావాదేవీల సలహాలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టీ-స్క్వేర్ నిర్మాణంతో హైదరాబాద్ వెస్ట్ పార్టీకు మరింత శోభ సంతరించ నుంది. ఇక్కడి నివాసితులకు, ప్రాంతానికి మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఈ కట్టడం నిలుస్తుందని భావిస్తున్నారు.
రాయదుర్గంలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు • ఆర్కిటెక్చరల్, లావాదేవీల సలహాలకు టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. ఆగస్టు 9 వరకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది చివరిలోగా నిర్మాణ పనులు మొదలుకానున్నాయి.