CM Revanth : కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నీ చెప్తా.. రేవంత్ హాట్ కామెంట్
కృష్ణా జాలాల్లో అన్యాయం ఎక్కడ ఎలా జరిగిందనేది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చెప్తానని సీఎం రేవంత్ అన్నారు. అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం చేసింది కేసీఆరేనని అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని సవాలు విసిరారు. శ్రీశైలం నుంచి ప్రతి రోజూ 10 టీఎంసీల నీళ్లు పోతున్నాయని అన్నారు. తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసింది వాళ్ళు అని అన్నారు. పల్లకీలో పార్లమెంటుకు పంపిన పాలమూరును కేసీఆర్ ఎండబెట్టారని అన్నారు. నాగార్జున సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీసులు వచ్చింది కేసీఆర్ హయాంలోనే అని అన్నారు. నాగార్జున సాగర్ ను ఏపీ పోలీసులు కబ్జా చేస్తుంటే కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని అన్నారు. మన పోలీసులను అక్కడి పోలీసులు కొడితే చీము నెత్తురు లేదా..? అని ప్రశ్నించారు. ఇందనా మీ పదేండ్ల అనుభవమని ప్రశ్నించారు. సభను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. కుల దురహంకరాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని అన్నారు సీఎం.