Smita Sabharwal : ఐడియా ఇవ్వండి.. లక్ష గెలుచుకోండి.. స్మితా సబర్వాల్ వైరల్ పోస్ట్
తెలంగాణ ఆదాయం పెంచేందుకు ఐడియా ఇవ్వండి.. లక్ష రూపాయలు గెలవండి అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరో సంచలన ప్రకటన చేశారు. స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా, వైరల్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం పెంచడంపై ఇన్నోవేషన్ ఐడియా ఇచ్చి లక్ష రూపాయలు గెలుచుకోవాలని సూచించారు.
ఐడియాను 2024 సెప్టెంబర్ 30 వరకు తమకు పంపించాలని ఆమె తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన ఈ పోస్టుపై చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ కామెంట్ల రూపంలో వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం tgsfc2024@gmail.comనుసంప్రదించాలని ఆమె సూచించారు. ప్రస్తుతం ఆమె ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది.