తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన దొడ్డా పద్మ (99) కన్నుమూశారు. గత కొన్ని రోజుల క్రితం సూర్యాపేటలోని ఆమె స్వగృహంలో కాలు జారి కిందపడడంతో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా...నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు.
దొడ్డా పద్మ భర్త, దొడ్డ నర్సయ్య సీపీఐ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా కూడా ఆయన సేవలందించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో భార్య భర్తలు ఇద్దరూ నల్లమల ప్రాంతం లో మూడేళ్ళు అజ్ఞాతవాసం గడిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి... “తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ మరణం తీవ్ర ఆవేదనను కలిగించింది. వారి ఆత్మకు చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని రాసుకొచ్చారు.