Cow : మూగజీవికి పురుడు పోసిన వైద్యుడు..

Update: 2024-07-15 06:20 GMT

మనిషికి ఏదైనా ఆపద వస్తే,అత్యవసరం ఉంటే తెలిసిన స్నేహితులకో లేక అందుబాటులో ఉన్న వాళ్ళకో సమాచారం అందిస్తాం లేక చెబుతాం కానీ నోరు లేని మూగ జీవాలకు ఏదైనా వస్తే, ఎవరికి చెప్పలేని పరిస్థితి.. అచ్చం ఇలాంటి సంఘటన షాద్ నగర్ నియోజకవర్గం మున్సిపాలిటీ క్రిస్టియన్ కాలనీలో ఆదివారం ఉదయం జరిగింది.కాలనీలో 7గంటలకు అగ్గనూరి కేదారేశ్వర్(చింటూ)అనే యువకుడు పనిమీద వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న మూగ జీవి గోమాత ఆపసోపాలు పడుతుండటం చూసి ఒక విలేకరికి సమాచారం ఇవ్వగా,అతను పశువైద్య శాఖ అధికారి ఏడి గోపాల కృష్ణకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా,అతను కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది సాయన్న,వీఎల్ఓ అశోక్ కుమార్,లక్ష్మణ్(గోపాల మిత్ర),లకు విషయం తెలపడంతో హుటాహుటిన వెళ్లి సకాలంలో గోమాతకు పురుడు పోయడంతో మూగ జీవికి మాతృత్వాన్ని ఇచ్చిన దాతలుగా కొనియాడుతున్నారు.సకాలంలో స్పందించి,ఒక మూగ జంతువుకు మరో ప్రాణాన్ని కాపాడినందుకు గాను,కాలనీ వాసులు,ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆదివారం అందులోను సకాలంలో స్పందించి మూగ జంతువుకు పురుడు పోయడం పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఏదైమైనా మూగ జంతువు గోమాతకు పురుడు పోసి మరో ప్రాణాన్ని కాపాడినందుకు గాను యువకులను,వైద్య సిబ్బందిని మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News