Nagarjuna : సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన నాగార్జున..!
Tollywood : తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. హీరో నాగార్జున, డైరెక్టర్ ప్రీతమ్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి, మరో ఇద్దరు సినీ ప్రముఖులు విజయవాడ వెళ్లారు.;
Tollywood : తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. హీరో నాగార్జున, డైరెక్టర్ ప్రీతమ్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి, మరో ఇద్దరు సినీ ప్రముఖులు విజయవాడ వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న హీరో నాగార్జున.. జగన్‌ను కలిశారు. సరిగ్గా ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలోనే విజయవాడలో ల్యాండ్ అయ్యారు సినీ ప్రముఖులు. మంత్రివర్గ సమావేశంలో సినిమాటోగ్రఫీ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్ల అమ్మకాలపైనా ఏపీ క్యాబినెట్‌లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.