Shanmukh Jaswanth: బిగ్ బాస్ ఫేమ్ షణ్నూ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్‌ షేర్..

Shanmukh Jaswanth: అంతా ఓకే అనుకుంటున్న సమయంలో షణ్నూ ఇంట విషాదం చోటుచేసుకుంది.

Update: 2022-05-30 09:15 GMT

Shanmukh Jaswanth: బిగ్ బాస్ అనే రియాలిటీ షో చాలామందిని ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. కంటెస్టెంట్స్‌కు ఓ సెలబ్రిటీ స్టేటస్ తెచ్చిపెడుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 5తో చాలామంది ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అప్పటివరకు తాను చేసిన పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు షణ్నూను యూత్‌క దగ్గర చేసినా.. బిగ్ బాస్ తనకు మరింత క్రేజ్ పెరిగేలా చేసింది. ఇటీవల షణ్నూ ఇంట విషాదం చోటు చేసుకుంది.

బిగ్ బాస్ హౌస్‌లో అవసరం ఉన్న చోట మాత్రమే మాట్లాడుతూ.. టాస్క్‌లలో చురుగ్గా పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు షణ్నూ. చిన్న చిన్న మైనస్‌ల వల్ల తను విన్నర్ కాలేకపోయినా.. రన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత తన పర్సనల్ విషయాల వల్ల కొన్నాళ్లు వార్తల్లో నిలిచాడు షణ్నూ. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో షణ్నూ ఇంట విషాదం చోటుచేసుకుంది.

షణ్నూ బామ్మ ఇటీవల కన్నూమూశారు. ఈ విషయాన్ని బయటపెడుతూ షణ్నూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బామ్మతో ఉన్న వీడియోతో పాటు రెస్ట్ ఇన్ పీస్ అని క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ వీడియోలో 'నా పెళ్లి చూస్తావా' అని షణ్నూ అడగగా.. 'ఏమో చూస్తానో లేదో' అని బామ్మ సమాధానం. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ సంతాపం తెలియజేస్తున్నారు.



Tags:    

Similar News