Bus Ticket : బస్సులో రామచిలకలకు టికెట్..

Update: 2024-03-28 08:03 GMT

ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన కొన్నిసార్లు హెడ్ లైన్స్ లోకి వస్తుంటుంది. ఇలాంటిదే కర్ణాటకలో (Karnataka) చోటుచేసుకుంది. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తోంది. కర్ణాటకలో కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 'శక్తి' పేరుతో ఇదే పథకాన్ని అమలు చేస్తోంది.

బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తున్న బస్సులో ఓ వింత చోటుచేసుకుంది. బెంగళూరు పట్టణానికి చెందిన ఓ మహిళ తన మనవరాలితో కలిసి మైసూరు వెళ్లేందుకు బస్సెక్కింది. మహిళ తన వెంట రెండు రామచిలుకలను తీసుకెళ్తోంది. గమనించిన కండక్టర్ ఇద్దరికీ ఫ్రీ టికెట్ ఇచ్చేశాడు. వారు పంజరంలో తీసుకెళ్తున్న చిలుకలకు ఆ కండక్టర్ ఏకంగా రూ. 444 టికెట్ కొట్టాడు. వారిని కూడా పిల్లలుగా ట్రీట్ చేశాడు ఆ కండక్టర్

టికెట్ కొట్టడంతో ప్యాసింజర్లు షాకయ్యారు. ప్లేస్ తీసుకుంటుంది కాబట్టి దానికి టికెట్ కొట్టానని కండక్టర్ చెప్పాడు. రూల్స్ ప్రకారం జంతువులు, పక్షులు బస్సులో తీసుకెళ్తే వాటికి హాఫ్ టికెట్ కొట్టాల్సిందేనని అన్నాడు. రూ.444 టికెట్‌తో బామ్మ, మనవరాలు, రామచిలకల ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఆ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

Tags:    

Similar News