Tamilnadu : ఏనుగును వెంబడించిన వాహనం.. వీడియో వైరల్

Update: 2024-02-17 09:18 GMT

తమిళనాడులోని (Tamilnadu) పొల్లాచ్చిలోని ఆనైమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో అడవి ఏనుగును ప్రజలు వెంబడించిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ కార్యకర్తలు కోరుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లోని వన్యప్రాణి పరిశీలకులు నవమలై రహదారిపై వీడియో చిత్రీకరించినట్లు ధృవీకరించారు. ఈ రహదారి కోర్ టైగర్ రిజర్వ్ గుండా వెళుతున్నందున సాయంత్రం 6 గంటల తర్వాత వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలవుతున్నాయి.

వీడియోలో ఎఐఎడిఎంకె జెండా ఉన్న వాహనం అడవి ఏనుగును వెంబడిస్తున్నట్లు చూపిస్తుంది. అది అలా భయంతో పరుగెత్తడం జంతు ప్రేమికులను కలవరపర్చింది. తన ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్టోరీలో వీడియోను పోస్ట్ చేసిన ఎఐఎడిఎంకె క్యాడర్ మిథున్ మతి.. ప్రజలకు ప్రవేశం లేని అడవిలోని రహదారిపై వారు వాహనాన్ని నడుపుతున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు.

ఇక పర్యావరణ కార్యకర్తలు ఈ చర్యను ఖండించారు. వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం చర్య తీసుకోవాలని కోరారు. చట్టం ప్రకారం జంతువులను వేటాడటం నేరం. కావున ఈ చర్యకు వారికి జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఈ విషయాన్ని రాష్ట్ర చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News