AP : కమల్‌ హాసన్‌ను మించిన నటుడు జగన్: చంద్రబాబు

AP : కమల్‌ హాసన్‌ను మించిన నటుడు జగన్: చంద్రబాబు

సీఎం జగన్‌పై (CM Jagan) టీడీపీ చీఫ్ చంద్రబాబు (Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. సీమలో ట్రెండ్ మారిందని.. వైసీపీ బెండు విరగడం ఖాయమని చెప్పారు. ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. జగన్ కమల్ హాసన్‌ను మించిన నటుడని.. ఆయనను కరకట్ట కమల్ హాసన్ అని పిలుస్తానని అన్నారు. ఏపీలో అన్ని లోక్‌సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం జగన్ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ‘ఐదేళ్లలో రాయలసీమకు ఏం చేశావని జగన్‌కు సవాల్ విసురుతున్నా. జగన్‌కు సీమ అంటే హింస, హత్యా రాజకీయాలు. టీడీపీకి సీమ అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు. మేం ‘కియా’ పరిశ్రమ తెస్తే.. జగన్ ‘జాకీ’, ‘అమర్ రాజా’ కంపెనీలను వెళ్లగొట్టారు’ అని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story