AP : నేడు 5 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన

AP : నేడు 5 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన
X

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ 5 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉండి, ఏలూరు, గన్నవరం, మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఎల్లుండితో శాసనసభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో చంద్రబాబు ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ అధికారపార్టీపై విమర్శలుచేయనున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించే లక్ష్యంతో చంద్రబాబు పర్యటనలు సాగనున్నాయి.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి, కాకినాడ జిల్లా పిఠాపురం, కడప నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ నుంచి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. కావున ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఆసక్తిరేపుతోంది.

Tags

Next Story