తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో మనం చూశాం. వైసీపీ హయాంలో అత్యంత నీచమైన పని ఏదైనా ఉందంటే అది ఇదే. ఎన్నో అక్రమాలు అరాచకాలు చేసిన వైసిపి.. ఏకంగా కలియుగ దైవం, హిందువులు అత్యంత పవిత్రంగా కొలిచే తిరుపతి దేవస్థానం లడ్డూను కల్తీ చేసి అందులో కోట్లు సంపాదించుకున్నారు వైసీపీ నేతలు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయగా సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి హయాంలోనే కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందని సిట్ ప్రాథమికంగా భావిస్తోంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ఈ కల్తీ నెయ్యి కేసులో అత్యంత కీలకంగా మారాడు.
అప్పటివరకు నెయ్యి సరఫరా చేస్తున్న డైరీల నుంచి ఈ అప్పన్న నేరుగా కమిషన్ అడిగాడు. కానీ వాళ్లు అందుకు ఒప్పుకోకపోవడంతో తన మాట వినని కంపెనీల నెయ్యిని నాలుగు శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించి.. అవి కల్తీ జరిగాయని చెప్పి టీటీడీలో తనకున్న పట్టును ఉపయోగించి ఆ డైరీలను మధ్యలోనే తప్పించాడు. ఆ తర్వాత అప్పన్నకు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నా ప్రీమియం అగ్రి ఫుడ్స్ ను రంగంలోకి దించాడు. ఈ కంపెనీ ఏకంగా 130 రూపాయలు ఎక్కువగా ఇవ్వటంతో కోట్ చేసి మరీ.. కాంట్రాక్ట్ ను ఓకే చేయించాడు అప్పన్న.
సదరు డైరీ కంపెనీ హవాలా రూపంలో అప్పన్నకు భారీ స్థాయిలో కమీషన్లు చెల్లించినట్లు సిట్ విచారణలో తేలింది. ఢిల్లీలో ఇతడి పేరిట నాలుగైదు బ్యాంకు ఖాతాలున్నాయని, వాటిలో రూ.4.50 కోట్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. విశాఖ నగరంతో పాటు పరిసరాల్లో ఖరీదైన 13 స్థలాలు, మరో నాలుగైదు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు ఇతడి పేరిట ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవహారం వెనుక వై వి సుబ్బారెడ్డి సపోర్ట్ ఉన్నట్టు సిట్ భావిస్తోంది. అప్పన్న చెప్పిన వివరాలను మొత్తం వీడియో రూపంలో చిత్రీకరించారు అధికారులు. అవసరమైతే వైవి సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని అప్పన్న ముందే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.