దేశమంతా ఇప్పుడు విశాఖకు వస్తున్న గూగుల్ డేటా సెంటర్ గురించే మాట్లాడుకుంటోంది. పక్క రాష్ట్రాల సీఎంల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు అందరూ ఈ విషయంపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. అంతెందుకు శత్ర దేశాలైన పాకిస్థాన్ మీడియా కూడా ఏపీకి వస్తున్న గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ వ్యాలీ గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారు. కానీ ఏపీ ప్రజలు ఓ సారి అధికారం ఇచ్చినందుకు వైసీపీ ఇప్పటికీ రకరకాల అభ్యంతరాలు తెలుపుతూనే ఉంది. ఇప్పుడు ఏపీకి వస్తున్న గూగుల్ డేటా సెంటర్ మీద కూడా రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్ గా చేసిన గుడివాడ అమర్ నాథ్ మాట్లాడిన మాటలు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి.
అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎవడికి ఉపయోగం అని ఆయన అనడం ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు. వైసీపీ హయాంలో అదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామంటే 20 వేల మందికి ఉద్యోగం ఇస్తేనే రావాలని.. లేదంటే వద్దు వెళ్లిపోమని చెప్పామని ఆయన చెప్పడం వింటే ఎవరికైనా షాకింగ్ గానే అనిపిస్తుంది. ఆయన విజ్ఞానం ఆ స్థాయిలో ఉంది మరి అంటున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ వస్తే.. చాలా కంపెనీల డేటా సెంటర్లు ఇక్కడకు వస్తాయి. వాటికి తోడు ఐటీ కంపెనీలు ఇక్కడికే క్యూ కడుతాయి. లక్షల్లో ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఇది విశాఖకే కాదు ఏపీకే ఓ పెద్ద అడ్వాంటేజ్.
ఆ విషయం ఎవరిని అడిగనా చెప్తారు. ఆల్రెడీ ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. కానీ డేటా సెంటర్ వద్దు.. దానికి తోడు డెవలప్ మెంట్ సెంటర్ వస్తేనే లాభం అన్నట్టు అమర్ నాథ్ మాట్లాడటం చూస్తుంటే.. అసలు వైసీపీ వాళ్లకు గూగుల్ డేటా సెంటర్ రావడమే ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. వాళ్ల హయాంలో రానివి ఇప్పుడు కూటమి హయాంలో చంద్రబాబు, లోకేష్ వల్ల వస్తుంటే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. క్రెడిట్ మొత్తం సీఎం చంద్రబాబు, లోకేష్ ఖాతాలోకి వెళ్లిపోతుంటే వాళ్లకు నచ్చట్లేదు. అందుకే ఈ కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోతే బాగుండు అన్నట్టు వాళ్లు మాట్లాడటం చూస్తుంటే ఎవరికైనా వీళ్ల అసలు రూపం తెలిసిపోతుంది.