AP Weather : వచ్చే రెండు రోజులు ఏపీలో తీవ్ర వడగాలులు : వాతావరణ శాఖ

Update: 2024-04-15 11:22 GMT

వచ్చే రెండు రోజులు ఏపీలో తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు.. మంగళవారం 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ నంద్యాల(D) గోస్పాడులో 43.4 డిగ్రీలు, విజయనగరం(D) తుమ్మికపల్లిలో43.3 డిగ్రీలు, ఆముదాలవలసలో 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది.

ఇక తెలంగాణలో ఃఃనిన్నటి పోలిస్తే నేడు, రేపు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరగొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఏడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదయ్యాయి. గరిష్ఠంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలాల్లో 42.7 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. మరోవైపు రాజధాని హైదరాబాద్‌లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. మూసాపేటలో గరిష్ఠంగా 41 డిగ్రీలు నమోదైంది.

Tags:    

Similar News