కడపలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష సోదరుడు అహ్మద్ భాషాను పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో అహ్మద్ భాషా పై మరో కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు చేరుకుంటుడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న ముంబైలో అరెస్టు చేసిన కడప పోలీసులు భారీ భద్రత నడుమ ఇవాళ నగరానికి తీసుకొచ్చారు. నగర శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అహ్మద్ భాష అరెస్టుతో నిన్న అంజాద్ బాష ఇంటికి దగ్గరలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అంజాద్ భాష ఇంటికి దగ్గర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పెద్ద ఎత్తున టపాసులు పేల్చి, స్వీట్లు పంచారు. టీడీపీ సంబరాలపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.