Chandrababu: ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం మన దురదృష్టం - చంద్రబాబు
Chandrababu: రాష్ట్ర రాజధానిపై మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.;
Chandrababu: రాష్ట్ర రాజధానిపై మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర భవిష్యత్‌పై విషం చిమ్ముతున్నారన్నారు. ఇది భవిష్యత్ తరాలపై ప్రభావం చూపుతుందని.. వితండవాదంతో చట్టాలు చేస్తారా? అని విరుచుకుపడ్డారు. చట్టాల నిర్వహణ బాధ్యత ఎగ్జిక్యూటివ్ వ్యవస్థదని.. కోర్టు తీర్పులను శిరసావహించాలని.. కామెంట్ చేస్తారా అని మండిపడ్డారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఇదో ఉదాహరణ అని చురకలంటించారు. మూడు రాజధానులనే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. కావాల్సింది అధికార వికేంద్రీకరణ కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు. నమ్మకద్రోహం చేసిన జగన్‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని.. జగన్ వెంటనే రాజీనామా చేయాన్నారు చంద్రబాబు.