Chandrababu Naidu : సైబర్ టవర్స్ వద్ద బాబు భారీ కేక్ కట్

Update: 2024-04-20 09:27 GMT

మాజీ సీఎం చంద్రబాబు అంటే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి అపారమైన గౌరవం. హైదరాబాద్ సైబర్ టవర్స్ దగ్గర సాఫ్ట్ వేర్ నిపుణులు చంద్రబాబు 75వ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారని.. ఇప్పటికీ ప్రజాజీవితంలో అలుపెరగకుండా పనిచేస్తున్నారని వాళ్లు చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్త తెలుగు తమ్ముళ్లు, టీడీపీ అభిమానులు ఆయన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఉదయం నుండే పెద్ద ఎత్తున పలు సేవ కార్యక్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

సోషల్ మీడియా లో CBNbirthday హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారూ అంటూ రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు విష్ చేస్తున్నారు.

Tags:    

Similar News