ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ( CM Chandrababu Naidu ) కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీగాయత్రి నిలయం గెస్ట్‌హౌస్‌లో సీఎం చంద్రబాబు రాత్రి బస చేస్తారు.
గురువారం ఉదయం వెంకటేశ్వరస్వామిని చంద్రబాబు.. తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అంతకు ముందు చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు.. తిరుమలలోని శ్రీ భూ వరాహ స్వామి ఆలయాన్ని సైతం సందర్శించనున్నారు.
గురువారం సాయంత్రం పదవీ బాధ్యతలు తీసుకోనున్న చంద్రబాబు 3 కీలక ఫైళ్లపై సంతకం చేయనున్నారు.