AP : జగన్ కోసం 986 మందితో భద్రతా?.. సీఎం బాబు ఆశ్చర్యం

Update: 2024-06-29 07:02 GMT

రాజకీయ నేరస్థులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని సీఎం చంద్రబాబు ( CM Chandrababu Naidu ) అన్నారు. ఒక ముఖ్యమంత్రికి 986 మందితో భద్రతా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం జగన్ ( YS Jagan ) భద్రత అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నపై చంద్రబాబు స్పందించారు.

"ఒక ముఖ్యమంత్రి భద్రతకు 986 మంది సిబ్బంది కావాలా? అదీ పరదాలు కట్టుకొని తిరగడానికి..! మేం వెళ్లినా పరదాలు కట్టేస్తున్నారు.. ఏంటయ్యా ఇది అని అడిగితే అలవాటైపోయింది సర్ అంటున్నారు. పరదాలు కట్టడం, చెట్లు కొట్టేయడమేంటి? అవసరమైన మేరకే ట్రాఫిక్ ఆపాలని చెబుతున్నా. నాకు రెండు నిమిషాలు లేటైనా ఫర్వాలేదు.. నేను నిలబడతాను. వాళ్లంతా వెళ్లాకే వెళ్తానని చెబుతున్నా. ఎక్కువ టైం ఎక్కడా ఆఫ్ చేయొద్దని మంత్రులకు, కేబినెట్ సమావేశంలోనూ చెప్పాను. ఎలాంటి ఆర్భాటాలూ వద్దని చెప్పా. మనమేం రాజులం కాదు.. డిక్టేటర్లం కాదు... ఇష్టానుసారం చేయడానికి, ప్రజాసేవకులుగా ప్రవర్తించమంటున్నా" అని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News