మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్దా రాఘవరావు ( Siddha Raghava Rao) వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శిద్దా ప్రకటించారు.
శిద్దా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి మొగ్గుచూపినా వైసీపీ అధిష్ఠానం పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకాశంలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదోఒక సీటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. చివరికి శిద్దా మౌనంగా ఉండిపోయారు
ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి శిద్దా రాఘవరావు అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రిగా పని చేశారు. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.