Telugu States : నిప్పులకొలిమిలా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు

Update: 2024-04-04 04:51 GMT

తెలంగాణలో (Telangana) ఎండలు నిప్పులకొలిమిలా మారుతున్నాయి. ఈ వేసవిలో తొలిసారిగా 45డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో భానుడి ప్రతాపం అధికంగా ఉంది. నేటి నుంచి ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాల్పులు అధికంగా ఉంటాయని IMD అంచనా వేసింది.

ఇక ఏపీలో (AP) 130 మండలాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం 19, పార్వతీపురం మన్యం 12, అల్లూరి సీతారామరాజు 4, అనకాపల్లి 13, కాకినాడ 9, కృష్ణా 1, NTR 14, తూ.గో 3, గుంటూరు 5, పల్నాడు 6, నంద్యాల 19, అనంతపురం 1, కడప జిల్లాలో 20 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Tags:    

Similar News