Heavy Rains : కోస్తాంధ్ర జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

Update: 2024-06-27 05:10 GMT

కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉ.8.30 వరకుఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, WGL, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయంది.

మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలోఈదురు గాలులతో వర్షాలు అవకాశం ఉంది..

Tags:    

Similar News