YS Jagan : జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు

Update: 2024-07-02 05:07 GMT

తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ( YS Jagan Mohan Reddy ) ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులు తొలగించారు. ఇంటికి వెళ్లే దారిలోని హైడ్రాలిక్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్‌, చెక్‌పోస్టును సైతం తీసేశారు. కాగా ఇప్పటికే జగన్ నివాసం వద్ద మూసివేసిన రహదారిని ప్రజల రాకపోకల కోసం ప్రభుత్వం తెరిపించిన సంగతి తెలిసిందే.

అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ భద్రతలో ఏకంగా 986 మంది సిబ్బంది ఉన్నారని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సిబ్బందితోపాటు ఆయన కోసం అత్యాధునిక రక్షణ పరికరాలు.. ప్యాలెస్‌ చుట్టూ 30 అడుగుల ఎత్తున ఇనుప గోడ (కంచె), బుల్లెట్‌ ప్రూఫ్‌ క్రూయిజర్‌ వాహనాలు అందుబాటులో ఉండేవి. తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూనే ఎప్పుడూ 310 మంది ఆయన రక్షణలో ఉండేవారు

మరోవైపు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల్ని ఉల్లంఘిస్తూ ఆఫీసుని కూల్చేశారని అన్నారు. సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్‌ని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Tags:    

Similar News