వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఉండవల్లిలో నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో వీరు తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మోపిదేవి, మస్తాన్ రావుకు పార్టీ కండువాలు కప్పి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టులో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. అంతకముందు వీరిద్దరూ ఎంపీ పదవులతోపాటు వైసీపీకి కూడా రాజీనామా చేశారు.వీరికి టీడీపీలో కీలక పదవులు లభిస్తాయని చెబుతున్నారు.