ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఎదురులేకుండా దూసుకుపోతోంది. వైసీపీకు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు గట్టి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలను దాటి ఎన్డీఏ కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ భారీ మెజార్టీ దిశగా సాగుతున్నారు. లోక్‌సభ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. వెలువడుతున్న ఫలితాలతో కూటమి శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే 103కుపైగా స్థానాల్లో టీడీపీ...14 కుపైగా స్థానాల్లో జనసేన.. మూడు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా... వైసీపీ కేవలం 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఫలితాలు ఇలాగే కొనసాగితే వైసీపీకీ 25 స్థానాలు దక్కడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.