అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా కొత్త సభ్యులతో ప్రమాణం చేశారు. ఆయన గురువారమే రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం స్వీకారం చేశారు.
అసెంబ్లీలో తొలిరోజు సీఎం చంద్రబాబు ( CM Chandrababu ), డిప్యూటీ సీఎం పవన్ ( Pawan Kalyan ), వైసీపీ చీఫ్ జగన్ ( YS Jagan ), మంత్రి లోకేశ్ ( Nara Lokesh ) సహా చాలామంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రముఖుల ప్రమాణ స్వీకారం వీడియోలు వైరల్ అవుతున్నాయి. 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది.
మళ్లీ గెలిచాకే సభకు వస్తానని చంద్రబాబు శపథం చేయడం.. అన్నట్టుగా అలాగే సీఎంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం వీక్షకులను ఆకట్టుకుంటోంది. జగన్ సీటింగ్ మారింది. ఆయన మామూలు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి తనకు కేటాయించిన సీట్లో ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. జగన్ ప్రమాణం సమయంలో లోకేశ్ హావభావాలు ఆకట్టుకున్నాయి. ప్రమాణ స్వీకారం సమయంలో లోకేశ్ కొంత తడబడ్డారు.