Rains Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 3 రోజులు వర్షాలు

Update: 2024-05-23 05:00 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడనుందని IMD వెల్లడించింది. ఇది 2 రోజుల్లో తుఫానుగా మారనుందని తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఏపీలో 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ మన్యం, ఏలూరు, కృష్ణా, NTR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయంది. తీరం వెంబడి గంటకు 30-40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు లేదా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, మెదక్, జిల్లాలకు ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News