Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోతోందని అంగీకరించిన జగన్ ప్రభుత్వం..

Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోయింది. స్వయంగా జగనే ఈ విషయం ఒప్పుకున్నారు.

Update: 2022-04-28 08:15 GMT

Andhra Pradesh: ఏపీలో ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోయింది. స్వయంగా జగనే ఈ విషయం ఒప్పుకున్నారు. మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేకు ఓటు వేస్తారా అని అడిగితే 45 శాతం కంటే తక్కువే ఓట్లు వేస్తున్నారట జనం. స్వయంగా జగనే నిన్నటి మీటింగ్‌లో మంత్రులు, పార్టీ సమన్వయకర్తలకు ఈ విషయం చెప్పుకొచ్చారు. పార్టీ జరిపిన ఇంటర్నల్‌ సర్వేల్లో జగన్‌ గ్రాఫ్‌ టాప్ లెవెల్లో 65 శాతం ఉండగా.. మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫ్‌ 45 శాతంలోపే ఉందంటూ నిన్న అందరి ముందూ చెప్పుకొచ్చారు.

ఓవైపు గ్రాఫ్‌ పడిపోతోందంటూనే.. 151 సీట్లకు తగ్గొద్దని, 175కు 175 ఎందుకు రావంటూ మాట్లాడారు జగన్. ఎమ్మెల్యేల గ్రాఫ్‌ పడిపోతోందంటూ చెబుతూనే.. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందంటూ విరుద్ధ ప్రకటనలు చేశారు జగన్. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలకు 45 శాతం మంది మాత్రమే మద్దతిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ గ్రాఫ్ ఇంకాస్త పడిపోవచ్చని కూడా మాట్లాడుకున్నారు. అయినప్పటికీ అధికారంలోకి వస్తామని నిన్నటి మీటింగ్‌లో మాట్లాడుకున్నారు.

అంతేకాదు, ఓ వైపు గ్రాఫ్ పడిపోతున్నా సరే.. 175కు 175 స్థానాలు ఎందుకు గెలుచుకోలేం అంటూ ప్రశ్నించారు. జగన్‌ స్వయంగా విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారంటూ నిన్నటి మీటింగ్‌ నుంచి బయటికొచ్చిన తరువాత కొందరు మంత్రులు, నేతలు మాట్లాడుకున్నారు. ఎమ్మెల్యేలు గెలవనప్పుడు అసలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎక్కడిది, జగన్‌ సీఎం అవడం ఎక్కడిది అంటూ గుసగుసలాడుకున్నారు.

మళ్లీ అధికారంలోకి వస్తాం.. ఇప్పుడున్న సమన్వయకర్తలకు మళ్లీ మంత్రి పదవులు ఇస్తాం అని చెప్పుకొచ్చారు జగన్. నిన్నటి మీటింగ్‌లో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. జగన్‌ ఊహల్లో తేలియాడుతున్నారని విశ్లేషించారు. ఎన్నికల్లో గెలిచేసినట్టు, ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలో ఫిక్స్‌ అయినట్టు, టికెట్లు ఇవ్వని వాళ్లకి ఎమ్మెల్సీలు, నామినేటెడ్‌ పదవులు పంచేయబోతున్నట్టు మాట్లాడడం.. పొలిటికల్ అనలిస్టులకు వింతగా అనిపించింది.

అసలు ఎమ్మెల్యేలపై ప్రజా మద్దతు 45 శాతం లోపే ఉన్నప్పుడు.. వీళ్లంతా ఎమ్మెల్యేలుగా ఎలా గెలుస్తారు, అధికారం ఎలా చేతికి వస్తుందనుకుంటున్నారు అని విశ్లేషిస్తున్నారు. ఎమ్యెల్యేలు మెజారిటీ స్థానాలు సాధిస్తేనే సీఎంగా మళ్లీ బాధ్యతలు తీసుకోవడం ఉంటుందని, తన ఒక్కడి గ్రాఫ్‌ 65 శాతానికి పెరిగినంత మాత్రాన ముఖ్యమంత్రి కాలేడని చెబుతున్నారు. జగన్ ఈ లాజిక్ మిస్‌ అయి మాట్లాడుతున్నారంటూ చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:    

Similar News