Pithapuram Nomination : నేడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్

Update: 2024-04-23 07:54 GMT

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9.30కు చేబ్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ క్షేత్రం వరకు వెళ్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ సమర్పిస్తారు.

పవన్ కల్యాణ్ నామినేషన్ ర్యాలీ తొలుత గొల్లప్రోలు పట్టణం వద్ద జాతీయ రహదారిపైన మొదలవుతుంది. గొల్లప్రోలు తాహసిల్లార్ కూడలి, సూరీడు చెరువు, పిఠాపురం దూళ్ల సంత, చర్చి సెంటర్, పిఠాపురం బస్టాండ్, ఉప్పాడ బస్టాండ్, గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్ రోడ్డు మీదుగా పాదగయ క్షేత్రం వద్ద ర్యాలీ ముగుస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పవన్ తన నామినేషన్ ను దాఖలు చేస్తారు.

నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 25వ తేదీ తుది గడువు. నామిషన్లను వేయడానికి ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Tags:    

Similar News