ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలైంది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తోన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏప్రిల్ 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జనసేన ట్విట్టర్ లో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారని తెలిపింది.
టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురువారం సాయంత్రమే ఆమె కుప్పం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేస్తారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 21న తమ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేయనున్నారు. 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ అభ్యర్థులకు స్వయంగా అందిస్తారు. ఎక్కడైనా మార్పులు, చేర్పులు ఉంటే ఒకట్రెండు రోజుల్లోనే తేల్చేయనున్నారు. కాగా ఇవాళ ఆయన పార్టీ జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమయ్యారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.