AP : పిఠాపురం రాజకీయం.. ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసుకోండి

Update: 2024-03-15 06:59 GMT

టీడీపీ-జనసేన తరఫున పవన్ కల్యాణ్ పోటీలో నిలవడంతో పిఠాపురం నియోజకవర్గం నేషనల్ హైలైట్ అయింది. పిఠాపురం కులాల లెక్కలు ఓసారి చూద్దాం. పిఠాపురంలో కాపు సామాజిక వర్గం అధికం. దాదాపు 91 వేల పైగా ఆ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. కాపుల్లో మెజారిటీ వర్గం పవన్ వెంట నడుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ముద్రగడ ద్వారా కొంత అడ్డుకట్ట వేయాలని జగన్ చూస్తున్నారు.

మాలలతోపాటు శెట్టిబలిజలు, చేనేత కార్మికులు, బెస్తలను వైసీపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు ఆ పార్టీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి. రెడ్డి, యాదవ,తూర్పు కాపు, మాదిగ సామాజిక వర్గాన్ని ఆకర్షించాలని ప్లాన్స్ వేస్తున్నారు. మొత్తం ఆ సామాజిక వర్గ నేతలను పిఠాపురంలో ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే.. అప్పుడు పవన్ డిఫెన్స్ లో పడిపోయి మిగతా అన్ని సెగ్మెంట్లలో ఆయన అంతగా ప్రభావం చూపలేరనేది వైసీపీ ప్లాన్.

ఇప్పుడు పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ కీలకం కానున్నారు. 2014 ఎన్నికల్లో టికెట్ దక్కకపోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ విజయం సాధించారు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రయత్నం చేయాలని మద్దతుదారులు కోరుతున్నారు. మరోవైపు.. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదలడం లేదు వైసీపీ నేతలు. అసంతృప్తితో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు సైతం వైసీపీ కీలక నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఐతే ఆయన ఓటు బ్యాంక్ ను వైసీపీకి తరలించడం లేదా.. టీడీపీ కూటమి ఓట్లను చీల్చడం అనేది వైసీపీ ఎత్తుగడగా భావిస్తున్నారు.

Tags:    

Similar News