YS Jagan : జగన్ కు హైకోర్టులో రిలీఫ్

Update: 2024-06-27 09:10 GMT

ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారంటూ... ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధమైందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. తాము ఇప్పటికిప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు. దీంతో కేసు విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు స్టేటస్‌ కో పాటించాలని ఆదేశించింది.

Tags:    

Similar News