మహాకవి శ్రీరంగం శ్రీనివాసురావు (శ్రీశ్రీ) కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అమెరికా కనెటికట్ రాష్ట్రంలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం స్థానికంగానే ఆయన అంత్యక్రియలు పూర్తిచేశారు. వెంకట రమణ మృతి పట్ల సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. పాతికేళ్ల క్రితం అమెరికా వెళ్లిన వెంకట రమణ, ఫైజర్ కంపెనీ పరిశోధన విభాగంలో పనిచేస్తున్నారు.
శ్రీ రంగం వెంకటరమణ కుటుంబం పాతికేళ్ల కిత్రం అమెరికాలో స్థిరపడింది. ఫైజర్ కంపెనీలో వెంకటరమణ పరిశోధన విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడికి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) అని, కుమార్తెకు ‘కవిత’ పేరును పెట్టుకున్నారు. వెంకటరమణ కుటుంబానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్, పలువురు సాహితీవేత్తలు సానుభూతి తెలిపారు.