LOKESH: మంగళగిరి ప్రజలకు అండగా ఉంటా: లోకేశ్‌

వరుసగా రెండో రోజూ ఉండవల్లి నివాసంలో “ప్రజాదర్బార్... ప్రజల నుంచి వినతుల స్వీకరణ;

Update: 2024-06-17 03:00 GMT

మంగళగిరి ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వరుసగా రెండో రోజూ ఉండవల్లి నివాసంలో “ప్రజాదర్బార్” నిర్వహించారు. తరలివచ్చిన నియోజకవర్గ ప్రజల వినతులు స్వీకరించారు. అరుదైన వ్యాధితో బాధ పడుతున్న 5 నెలల చిన్నారికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా వేడుకున్నారు. ధర్నా చేశామనే నెపంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపివేసిందని అంగన్వాడీ హెల్పర్ కొలనుకొండ రాజేశ్వరి కోరారు. ఎయిమ్స్ లో ఉద్యోగం ఇప్పించాలని మంగళగిరికి చెందిన పెదపూడి మర్తమ్మ విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు మిగిలిన వారందరి సమస్యలు విన్న లోకేష్... పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీఎస్సీ-2008, జీవో నెంబర్ 39 ప్రకారం M.T.S కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2 వేల 193 మందిని రెగ్యులర్ చేయాలని ఏపీ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేష్ ను కోరింది. ఆచార్య నాగార్జున వర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్లకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నులకపేట ఉర్దూ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పేరెంట్స్ కమిటీ సభ్యులు విన్నవించారు.


కార్యచరణకు ఆదేశం..

సొంత నియోజకవర్గం మంగళగిరిలో సమస్యల పరిష్కారానికి.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ .కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా...సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచుకున్న లోకేష్ ...మంత్రి అయ్యాక...సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శనివారం కూడా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు...ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో చెప్పిన లోకేశ్‌.... ఆ మేరకు ఉండవల్లిలోని తన నివాసంలో... మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తన దృష్టికి తెచ్చే సమస్యల పరిష్కారానికి వీలుగా...ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నపుడు.... ప్రతిరోజు ఇలా సమావేశాలు నిర్వహిస్తానని చెప్పిన లోకేశ్‌..వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని.... లోకేష్ తనను కలిసిన వారికి హామీ ఇచ్చారు.


నేడు పోలవరానికి బాబు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. I.T.D.A పీవో సూర్య తేజ, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఇతర శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని,..... అధికారులకు పర్యటన నిమిత్తం పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు వద్ద ఎలిప్యాడ్ ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించారు.

Tags:    

Similar News