TDP Protest on Petrol Rates: పెట్రోల్ పంప్‌కు దండేసి.. కొబ్బరికాయ కొట్టి..

TDP Protest on Petrol Rates: తిరుపతిలో టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు.;

Update: 2021-11-09 08:26 GMT

TDP Protest on Petrol Rates: తిరుపతిలో టీడీపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్ ధరల వల్ల ప్రజలు జేబులు ఖాళీ అవుతున్నాయని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత రేటు తగ్గించాలని డిమాండ్ చేశారు. వ్యాట్‌, ఇతర సెస్‌లు తగ్గిస్తేనే వినియోగదారులకు స్వల్ప ఊరట లభిస్తుందన్నారు. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తించారు.

పెట్రోల్ పంప్‌నకు దండ వేసి, టెంకాయ కొట్టి నిరసన తెలిపారు. కేంద్రం కాస్త రేటు తగ్గించినట్టే ఏపీ కూడా ప్రజలకు వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చమురు ధరలతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలకు కూడా కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటు స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

Tags:    

Similar News