TDP : టీడీపీలోకి వసంత..? మైలవరంలో రసవత్తర రాజకీయం

Update: 2024-02-28 07:19 GMT

TDP : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీకీ దూరంగా ఉంటున్న వసంత టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. కొద్దికాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న వసంత మొన్న చంద్రబాబు సీట్లు ప్రకటనతో రాజకీయంగా స్పీడ్ పెంచుతున్నట్లు తెలుస్తోంది. అంతర్గతంగా చర్చలు చేసి సీటు ఫై స్పష్టత తీసుకున్న వసంత అదే విషయాన్ని నాయకులకు చెబుతున్నట్లు సమాచారం.

మైలవరం టీడీపీ టిక్కెట్ తనకే కేటయించారని టీడీపీ, వైసీపీ లో తన అనుకూల నాయకులకు ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఐతవరం వేదికగా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సిద్దమైయే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకొని ముందుకు వెళదాం అని నాయకులకు ఆయన చెబుతున్నట్లు టాక్.

ఎన్టీఆర్ జిల్లాలో ఐదు సీట్లు ప్రకటన చేసిన చంద్రబాబు మైలవరం సీటు ప్రకటన చేయకపోవడం పెద్ద చర్చగా మారింది. దేవినేని ఉమాకు కూడా మైలవరం సీటు వసంతకు కేటాయిస్తున్నామని చెప్పినట్లు కూడా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం చంద్రబాబుతో సమావేశం ఉందని, దానిలో భాగంగానే నాయకులకు ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News