ఏపీలో వైసీపీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత వైసిపి హయాంలో ఇష్టారాజ్యంగా దాదాపు ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములను కబ్జా చేసింది వైసిపి బ్యాచ్. జగన్ అండతో ప్రభుత్వ అధికారులను తమ వైపుకు తిప్పుకొని కోట్ల విలువ చేసే భూములను సర్వే నెంబర్లు మార్చేసి కొట్టేసింది వైసిపి టీం. మరీ ముఖ్యంగా ఉమ్మడి అనంతపూర్ లోని వైసిపి కబ్జా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా గుంతకల్ లో ఏకంగా 30 ఎకరాల దాకా వైసిపి నేతలు కబ్జా చేసేసారు. దీని విలువ 60 కోట్ల దాకా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. గుంతకల్ లోని ఆలూరు రోడ్డుకు ఆనుకొని ఉన్న 332, 339, 340, 341 సర్వే నెంబర్లలోని భూమిని వైసీపీ నేతలు జగన్ సపోర్టుతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సర్వే నెంబర్లను మార్చేసి కబ్జా చేసేశారు. ఇన్ని రోజులు ఇది తమ భూమి అన్నట్టు ప్రచారం చేసుకున్నారు.
కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. గుంతకల్ టిడిపి నేత కోడెల చంద్రశేఖర్ పలుమార్లు సీఎంవో ఆఫీసుకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు వైసిపి నేతలకు మద్దతుగానే ఉంటున్నారు. ఎందుకంటే గత వైసిపి హయాంలో ఆ పార్టీ నేతలకు ప్రభుత్వ అధికారులకు చాలా లింకులు ఏర్పడ్డాయి. అందుకే వైసిపి బ్యాచ్ ఆగడాలకు ఇప్పటి అధికారులు కొమ్ముకాస్తున్నారు. ఇదే విషయంపై తాజాగా కూటమి ప్రభుత్వం ఆరా తీసింది. ఆ భూమిపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కబ్జాకు గురైనట్టు తేలితే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గుంతకల్ ప్రాంతానికి పాలిటెక్నిక్, మైనారిటీ కాలేజీలు కేటాయిస్తే కనీసం వాటిని నిర్మించేందుకు ప్రభుత్వ భూమి కూడా లేదంటున్నారు స్థానిక రెవెన్యూ అధికారులు. కానీ వైసీపీ నేతలు కబ్జా చేసిన 30 ఎకరాల గురించి మాత్రం బయట పెట్టట్లేదు. ఇదే విషయం మంత్రి నారా లోకేష్ దాకా వెళ్లడంతో.. ఆ భూములపై వెంటనే నివేదిక ఇచ్చి కాలేజీలకు భూములు కేటాయించాలంటూ ఆదేశించారు. దీంతో స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఆగమేఘాల మీద విచారణ ప్రారంభించారు. 15 ఎకరాలు కబ్జా అయిందన్నట్టు అధికారులు చెబుతున్నా 30 ఎకరాల దాకా కబ్జా అయిందని స్థానికులు అంటున్నారు. మరీ ఈ స్థాయిలో కబ్జాలు బయటకు రావడం పై ప్రజల్లో వైసిపి పట్ల తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది.