Vijay Thalapathy : విజయ్‌పై కవిత.. రికార్డులకు ఎక్కిన అభిమాని

Update: 2024-04-23 09:59 GMT

తమిళ స్టార్ హీరో, విజయ్ దళపతి కోసం 36 గంటల పాటు కష్టపడి కవితరాశాడు ఓ అభిమాని. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ మరోసారి దీంతో బయటపడింది. తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు.

ఓ అభిమాని విజయ్‌కి అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. తిరుప్పత్తూరు సమీపంలోని జడయ్యనేర్‌కు చెందిన కదిరవేల్ అనే అభిమాని విజయ్ గురించి మొత్తం 10 వేల పదాలతో అద్భుతమైన కవిత రాశాడు. ఇందుకోసం కదిరవేల్ సుమారు 36 గంటల పాటు శ్రమించారు.

ఈ ఫీట్ ను యూనివర్సల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫ్యూచర్ కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి. 

Tags:    

Similar News