Kalyan Ram : కళ్యాణ్ రామ్‌కు భారీ నష్టం.. షూటింగ్‌లో అగ్ని ప్రమాదం?

Update: 2024-05-10 07:35 GMT

కష్టపడుతున్నా కూడా రావాల్సిన హిట్లు పడని హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఆయనకు ఎంతో ట్యాలెంట్ ఉందని పలు సినిమాలు ప్రూవ్ చేశాయి. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్లు పడితే ఆయన కెరీర్ పీక్స్ లో ఉంటుంది. సొంత నిర్మాణం కారణంగా అనుకున్న ఆర్థిక వృద్ధి కూడా ాయన సాధించలేదని అంటుంటారు. ఐతే.. కళ్యాణ్ రామ్ అభిమానులకు షాక్ తగిలింది.

హీరో కళ్యాణ్‌ రామ్‌ సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4 కోట్ల నష్టం జరిగిందని తెలుస్తోంది. సినిమాలో ప్రతేకమైన సన్నివేశం కోసం వేసిన భారీ సెట్ లో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

విభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సీబీఐ ఆఫీస్ సెట్ నిర్మించి పది రోజుల పాటు ఈ సెట్ లో షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 9 రోజుల షూటింగ్ పూర్తి అయింది. మరో రోజు షూటింగ్ ఉందనగా.. అగ్ని ప్రమాదం జరిగి సెట్టు మొత్తం అగ్నికి ఆహుతి అయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం సమయంలో సెట్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. ఐతే.. అప్పట్లో ఆచార్య సినిమా సెట్లోనూ ఇలాగే ప్రమాదం జరిగిందన్న వార్తలు వచ్చాయి. ఇవి ప్రమాదాలా.. వీటికి ఇన్సూరెన్స్ చేస్తారా.. అన్నది కొందరి డౌట్.

Tags:    

Similar News