పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ రూ.వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతోంది. జూన్ 27న రిలీజైన ‘కల్కి’ ఇప్పటివరకు రూ.900 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 12న ‘భారతీయుడు-2’ రిలీజ్ కానుండగా అప్పటివరకూ ‘కల్కి’ ఫీవర్ కొనసాగనుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకొణె, దిశా పటాని నటించారు.
ఈ ఏడాదిలోనే మరికొన్ని తెలుగు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' మూవీ కోసం నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రిపుల్ ఆర్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నుంచి 'దేవర 1' & 'గేమ్ చేంజర్' పెద్ద సినిమాలు వస్తున్నాయి. 'డబుల్ ఇస్మార్ట్' లాంటి మరికొన్ని తెలుగు చిత్రాల గురించి హిందీ జనాలు మాట్లాడుకుంటున్నారు. మరి వీటిల్లో ఏవేవి నార్త్ బెల్ట్ లో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటాయో చూడాలి.