హీరో ప్రభాస్ ‘KALKI 2898AD’ రేపు రిలీజ్ కానుంది. ఆన్‌లైన్లో టికెట్లు పెట్టిన క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. ఆంధ్ర, తెలంగాణలోనే కాదు ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ముంబైలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మైసన్ INOXలోని జియో వరల్డ్ ప్లాజా ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో ఫ్యాన్స్ రూ.1,760, రూ.1,560 వెచ్చించి మరీ టికెట్లు కొంటున్నారు.
2898 AD’ మూవీ టికెట్ల బుకింగ్స్ ఏపీ వ్యాప్తంగా ప్రారంభించినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. క్షణాల్లోనే థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. కాగా నిన్ననే మూవీ టికెట్ రెట్లను పెంచుకునేందుకు మల్టీప్లెక్సులు, సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏపీ, తెలంగాణానే కాదు ప్రతి ప్రాంతంలోనూ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ ధరలు రెండు వారాల పాటుగా కొనసాగానున్నాయని తెలుస్తుంది.. ఆ తర్వాత టిక్కెట్ ధరలు తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమాలో అమితాబ్, మృణాల్ కు సంబందించిన కొన్ని అద్భుతమైన సీన్లు హైలెట్ గా నిలిచాయి.
విజువల్స్ మాత్రం ఓ రేంజులో ఉన్నాయి.. డైరెక్టర్ కష్టం ఇందులో కనిపిస్తుంది.. ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే భారీ వ్యూస్ లైకులతో దుమ్ము దులిపేస్తుంది.. సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.