Harish Shankar : ఎవరో బటన్‌ నొక్కితే బతికే కర్మ మనకు లేదు: హరీశ్‌ శంకర్‌

Update: 2024-05-13 07:56 GMT

ఓటు హక్కు ఆవశ్యకతపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. రాజకీయాల్లోకి వచ్చి సంపాదించిన నాయకులు కాదు..సంపాదించింది రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం ఖర్చుపెట్టిన నాయకున్ని గుర్తించండి. ఎవరో బటన్ నొక్కితే బతికే కర్మ మనకు లేదు. మన బటన్ మనమే నొక్కాలి అదే ఈరోజు ఈవీఎం బటన్ అవ్వాలి. ఓటు మన హక్కు మాత్రమే కాదు మన బాధ్యత కూడా- అంటూ హరీశ్‌ శంకర్‌ పోస్ట్ చేయగా ఇది వైరల్ గా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతాలను వెల్లడించారు ఎన్నికల అధికారులు. ఏపీలో 9.51 శాతం, తెలంగాణలో 9.48 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

ఖమ్మం జిల్లా ఏన్కూర మండలం రాయమాదారం గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదని పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో రైతులు ధర్నా చేపట్టారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.

Tags:    

Similar News