భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నరేంద్రమోడీ ( Narendra Modi ) రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే పార్ట్ నర్ పార్టీలకు మోదీ తన కేబినెట్లో సముచిత ప్రాధాన్యత కల్పించారు. మిత్ర పక్షాలైన తెలుగుదేశం, జేడీ యూ, శివసేన ఇలా ఎన్డీయే మిత్రపక్షాలకు కేబినెట్లో చోటు దక్కింది.
అజిత్ పవార్ ( Ajit Pawar ) నేతృత్వంలోని ఎన్సీపీ కూడా ఎన్డీయేలో భాగమే. ఐతే.. ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎన్డీయే మిత్రపక్షంగా ఉన్న ఎన్సీపీకి లోక్సభ ఎన్నికల్లో కేవలం ఒకే సీటులో గెలిచింది. ఆ పార్టీ తరుపున సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ గెలిచారు.
ప్రఫుల్ పటేల్ కు మోదీ కేబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించారు. ఐతే.. ఆయనకు కేంద్రమంత్రి పదవి కాకుండా సహాయమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసింది. దీంతో.. తమ స్థాయికి తగ్గ పదవి లభించలేదని ఎన్సీపీ తిరస్కరించినట్టు తెలిసింది.