Test Rankings : టెస్ట్ ర్యాంకింగ్స్ లో జైస్వాల్, గిల్ దూకుడు

Update: 2024-02-29 05:54 GMT

దుబాయ్: ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ (ICC Rankings) టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. సొంతగడ్డపై ఇంగ్లండ్ జరుగుతున్న టెస్టు సిరీస్ లో మన కుర్రోళ్లు దుమ్ములేపుతున్నారు. దాంతో భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. ఇక ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్ లో యశస్వి జైస్వాల్, దృవ్ జురెల్, శుభమాన్ గిల్ తదితరులు తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.

రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో వరుసగా 73, 37 పరుగులు చేసిన జైస్వాల్ కెరీర్ బెస్ట్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం జైస్వాల్ 727 రేటింగ్ పాయింట్లతో 12వ ర్యాంక్ కు చేరాడు. ఈ సిరీస్ లో అద్భత ప్రదర్శన చేస్తున్న జైస్వాల్ ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్ లో ఏకంగా 93 సగటుతో 655 పరుగులు సాధించాడు. అందులో రెండు డబుల్ సెంచరీలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా 22 ఏళ్ల ఈ యువ ఓపెనర్ టీమిండియా విజయాల్లో తనదంటూ ముద్రవేసుకున్నాడు.

ఇక మరో స్టార్ యువ బ్యాటర్ శుభ్ మన్ గిల్ కూడా తన ర్యాంక్ ను మెరుగుపర్చుకున్నాడు. నాలుగు టెస్టులో రాణించిన గిల్ నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ ర్యాంక్ కు చేరాడు. మరోవైపు ఈ సిరీస్ తో అరంగేట్రం చేసిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దృవ్ జురె చిరస్మరణీయ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. రాంచీ టెస్టు గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన దృవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

Tags:    

Similar News