వాంఖడేలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్లు విరాట్, మ్యాక్స్‌వెల్ విఫలమయ్యారు. కోహ్లీ 9 బంతుల్లో 3 రన్స్‌కు ఔట్ కాగా మ్యాక్స్‌వెల్ 4 బంతులాడి డకౌట్ అయ్యారు. ఈక్రమంలో మ్యాక్సీ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా దినేష్ కార్తీక్, రోహిత్ శర్మ సరసన మాక్స్‌వెల్ చేరాడు. మాక్స్‌వెల్ ఇప్పటివరకు 17 సార్లు ఐపీఎల్‌లో డకౌట్‌లు కాగా.. రోహిత్, కార్తీక్ 17 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.
ఇక భారీ అంచనాలతో 2024 ఐపీఎల్ బరిలో దిగిన మ్యాక్స్‌వెల్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చడం లేదు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్ కేవలం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. కాగా ఈ సీజన్లోనే మ్యాక్సీ మూడుసార్లు డకౌటవ్వడం గమనార్హం.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీతో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ 69, సూర్య 52, రోహిత్ 38 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో ముంబైకి ఇది రెండో విజయం కాగా ఆర్సీబీకి ఐదో ఓటమి.